: మారడోనా పచ్చి మోసగాడు: మాజీ భార్య క్లాడియా
డీగో మారడోనా... ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడు. సాకర్ మాంత్రికుడుగా పేరుగాంచిన మారడోనా ఆటకు గుడ్ బై చెప్పి ఏళ్లు గడుస్తున్నా... ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అలాంటి మారడోనాను అతని మాజీ భార్య క్లాడియా విల్లాఫాన్ (52) మాత్రం పచ్చి మోసగాడిగా అభివర్ణిస్తోంది. ఈ రోజు తన కుమార్తె జియానియాతో కలసి ఆమె కోర్టుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మారడోనా అకౌంట్ నుంచి తాను డబ్బు తీయలేదని చెప్పింది. మరోవైపు, తన అకౌంట్ నుంచి 6 మిలియన్ డాలర్ల డబ్బు మాయం అయిందని... తన డబ్బును తనకు వెనక్కి ఇప్పించాలని 54 ఏళ్ల మారడోనా కోర్టుకు విజ్ఞప్తి చేశాడు.