: మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నా, అందుకే కేబినెట్ భేటీకి రాలేదు: కేఈ
రాజమండ్రిలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హాజరు కాలేదు. పుష్కరాల్లో కనిపించని ఆయన, కేబినెట్ భేటీకీ గైర్హాజరవడంపై గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి క్రితం ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ తో మాట్లాడారు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నానని, ఈ కారణంగానే తాను కేబినెట్ భేటీకి హాజరుకాలేదని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ విషయాన్ని ఇదివరకే సీఎం నారా చంద్రబాబునాయుడికి కూడా తెలియజేయడంతో పాటు కేబినెట్ భేటీకి గైర్హాజరుపై అనుమతి తీసుకున్నానని ఆయన వివరించారు.