: ఏపీ సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తాం: టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని టీడీపీ యువనేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేటి ఉదయం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్న ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాల్సి ఉందన్నారు. అంతేకాక ఏపీకి ప్రత్యేక నిధులు విడుదల చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను తాము పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, రాష్ట్రం తరఫున గళమెత్తుతామని ఆయన ప్రకటించారు.