: ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు... పుష్కరాల మృతులకు లోక్ సభ నివాళి... వాయిదా


పార్లమెంటు రెండో రోజు సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. తొలుత, గోదావరి పుష్కరాల్లో మృతి చెందిన వారికి లోక్ సభ ఎంపీలు నివాళి అర్పించారు. సమావేశాలకు కాంగ్రెస్ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చారు. విపక్ష ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ సుమిత్ర మహాజన్ తిరస్కరించారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ వారిస్తున్నప్పటికీ, విపక్ష ఎంపీలు ప్లకార్డులు చూపిస్తూ నిరసన తెలపడంతో... మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News