: విభజన బిల్లులో ప్రత్యేక హోదా లేదని స్పష్టం చేసిన వెంకయ్య
ఓ వైపు ప్రత్యేక హోదా కోసం ఏపీలోని అన్ని పార్టీల నేతలు, ప్రజలు పట్టుబడుతుంటే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాత్రం దానికి భిన్నంగా స్పందించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశం లేదని స్పష్టం చేశారు. అయితే, ఎంపీలు విభజన బిల్లుపై సవరణలు అడుగుతున్నారని... దీనిపై పరిశీలన జరుగుతోందని చెప్పారు. ఏదేమైనప్పటికీ, ఏపీ ప్రజలకు ఇది చాలా బాధ కలిగించే అంశమే.