: గల్లా జయదేవ్ కు ప్రత్యేక బాధ్యతలు


గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. పుష్కరాలలో తొక్కిసలాట జరిగిన తర్వాత ఢిల్లీలోని ఆంగ్ల ఛానళ్లలో జరిగిన చర్చల్లో మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, నారాయణ, ఎంపీ సీఎం.రమేష్ లు పాల్గొన్నారు. అయితే, వీరు సరిగా వాదించలేకపోయారని చంద్రబాబు భావిస్తున్నారు. ఆంగ్లంలో జరిగిన చర్చలో వీరు సరిగా వాదనలు వినిపించలేకపోయారని ఆయన ఓ నిర్ణయానికొచ్చారు. దీంతో, ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడే నేతలు ఎవరున్నారా అంటూ వెతికితే, ఆయనకు గల్లానే కనిపించారు. దీంతో, ఆంగ్ల ఛానళ్లలో మాట్లాడే బాధ్యతను గల్లా జయదేవ్ కు చంద్రబాబు అప్పగించారట. మరెవరు కూడా ఆంగ్ల ఛానళ్లతో మాట్లాడ కూడదని ఆదేశించారట.

  • Loading...

More Telugu News