: రేవంత్ అనుచరులకు ఏసీబీ నోటీసులు


ఓటుకు నోటు కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన తెలంగాణ ఏసీబీ, తాజాగా బుధవారం నాడు రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్న సైదులు, అల్లూరి నారాయణరాజులకు నోటీసులు జారీ చేసింది. వీరిని విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే రేవంత్ డ్రైవరును ఏసీబీ విచారించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, ఈ కేసులో ఆడియో, వీడియో టేపులను పరిశీలించిన ఫోరెన్సిక్ విభాగం తుది నివేదికను నేడు ఏసీబీ కోర్టుకు సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణను వేగవంతం చేయాలని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News