: ‘పాలెం’ త్రయంలోనే ఏపీ సీడ్ కేపిటల్... సంబరాల్లో మూడు గ్రామాల ప్రజలు


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని పరిపానల కేంద్రం ‘సీడ్ కేపిటల్’ కేవలం మూడంటే మూడు గ్రామాలకే పరిమితం కానుంది. ఆ మూడు గ్రామాల పేర్ల చివరన ఒకే పేరుండటం విశేషం. అవే గుంటూరు జిల్లాకు చెందిన ఉద్ధండరాయునిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం గ్రామాలు. కృష్ణా నది తీరాన ఉన్న ఈ మూడు గ్రామాల్లోనే నవ్యాంధ్రప్రదేశ్ పరిపాలన కేంద్రం (సీడ్ కేపిటల్) నిర్మితం కానుంది. 16.9 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణమున్న ఈ మూడు గ్రామాల్లోనే సీడ్ కేపిటల్ ఏర్పాటు చేయాలని సింగపూర్ ప్రతినిధి బృందం నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి అందించిన మాస్టర్ ప్లాన్ లో తెలిపింది. విషయం తెలుసుకున్న ‘పాలెం’ త్రయం వాసులు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. సీడ్ కేపిటల్ పేరిట ఎక్కడ తమ గ్రామాల ఉనికి కోల్పోతుందోనన్న ఆందోళన వారిలో నెలకొన్నా... తమ గ్రామాల పరిధిలోనే ఏపీ అసెంబ్లీ, సచివాలయం, సీఎం, మంత్రుల కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయన్న భావన వారిని నిలువనీయడం లేదట. ప్రస్తుతం ఆ గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News