: లాల్ బహదూర్ శాస్త్రి జీవితంపై సినిమా


'జై జవాన్ జై కిసాన్' అన్న నినాదంతో యావత్ భారతావనిలో ఉత్తేజం రగిల్చిన లాల్ బహదూర్ శాస్త్రి జీవితంపై ఓ సినిమా తెరకెక్కనుంది. ఆ సినిమా పేరు కూడా 'జై జవాన్ జై కిసాన్'. స్వాతంత్ర్యానంతరం భారత్ కు రెండో ప్రధాన మంత్రిగా వ్యవహరించిన లాల్ బహదూర్ శాస్త్రిపై వస్తున్న ఈ సినిమాను విక్టోరియస్ ఎంటర్ ప్రైజెస్, కరిజ్మా సిరామిక్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మిలన్ అజ్మీరా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఓం పురి, ప్రేమ్ చోప్రా, రతి అగ్నిహోత్రి వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా, లాల్ బహదూర్ శాస్త్రి పాత్రలో భోపాల్ కు చెందిన ప్రఖ్యాత రంగస్థల నటుడు జహిలేశ్ జైన్ కనిపించనున్నారు.

ప్రస్తుతం షూటింగ్ మొదలైన ఈ చిత్రం అలహాబాద్, ముంబయి, ఢిల్లీతోపాటు రష్యాలోనూ చిత్రీకరణ జరుపుకోనుంది. గాంధీ, నెహ్రూలకు నమ్మిన అనుయాయిగా పేరుగాంచిన లాల్ బహదూర్ శాస్త్రి.. నెహ్రూ వారసుడిగా భారత ప్రధాని పదవిని అధిష్టించాడు. నెహ్రూ సోషలిజం భావాలకూ ఆయన వారసుడిగా నిలిచారు. నెహ్రూ మొదలెట్టిన అలీన ఉద్యమాన్ని ఈయన కొనసాగించారు. ఇక 1965లో పాకిస్తాన్ తో యుద్ధంలో భారత్ విజేతగా నిలవడంతో ఈయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అయితే, ఆ మరుసటి సంవత్సరమే, అనుమానాస్పదరీతిలో శాస్త్రి రష్యా నగరం తాష్కెంట్ లోని హోటల్ గదిలో విగతులయ్యారు.

  • Loading...

More Telugu News