: ఆస్తులమ్మేసి పిల్లితో ప్రపంచ యాత్రకు బయలుదేరారు


పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు. అందుకు తగ్గట్టే నవతరం తమ ఆలోచనలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకుంటున్నారు. జీవితం వైవిధ్యంగా ఉండాలని భావిస్తున్నారు. ఊహలకు అనుగుణంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని, జీవితాల్ని వినూత్నంగా మలచుకుంటున్నారు. అమెరికా జీవనశైలి నచ్చని ఓ యువజంట చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి, ఆస్తులమ్ముకుని పిల్లిని వెంటబెట్టుకుని ప్రపంచయాత్రకు బయల్దేరింది. వివరాల్లోకి వెళితే...మట్, జెసీకా జాన్సన్ దంపతులు అమెరికాలోని ఓ ఆటోమొబైల్ కంపెనీలో మేనేజర్, టైపిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నారు. నెలకు ఒక్కొక్కరికీ వెయ్యి డాలర్ల సంపాదన, శని ఆదివారాలు సెలవులు. హాయిగా కాలం సాగిపోతున్నా, ఎందుకో హఠాత్తుగా జీవితం విసుగుగా, నిరర్థకంగా, నిస్సత్తువగా సాగిపోతున్నట్టు అనిపించింది. దీంతో ఇల్లు, కారు, ఆస్తులు అమ్మేశారు. ఓ బోట్ కొనుక్కున్నారు. 2011 ఆగస్ట్ 12న ప్రపంచ యాత్రకు బయల్దేరారు. బాగా ఈదుతుందని 2012లో జార్జ్ అనే పిల్లిని తమ ప్రపంచ యాత్రలో భాగస్వామిని చేశారు. అమెరికాలో ప్రారంభమైన వీరి పయనం క్యూబా, బహమాస్, జమైకా, పెరూ దేశాల మీదుగా సాగుతోంది. యాత్ర బోర్ కొట్టేంతవరకు ఇలా ప్రపంచాన్ని చుట్టేస్తామని ఈ దంపతులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News