: బోయపాటి శ్రీనుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్
రాజమండ్రి పుష్కరాల తొలినాడు జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు విడవడం తెలిసిందే. దీనిపై రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ ఫిర్యాదు చేశారు. తొక్కిసలాట ఘటనకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, టాలీవుడ్ డైరక్టర్ బోయపాటి శ్రీను కారణమని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన జరిగిన సమయంలో బోయపాటి చేతిలో మైక్ కంట్రోల్ ఉందని శ్రీరాజ్ పేర్కొన్నారు.