: మాకు ఆ సత్తా ఉంది: మమతా బెనర్జీ


కేంద్రం అనుసరిస్తున్న విధానాలను మరోసారి తప్పుబట్టారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్రంలో అమల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల్లో కోత విధించడంపై ఆమె మండిపడ్డారు. బీజేపీ ముందు తృణమూల్ కాంగ్రెస్ తలొగ్గబోదని స్పష్టం చేశారు. "తొలినాళ్లలో మా పోరాటం సీపీఐ(ఎం)పైనే. ఇప్పుడు కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మా పోరు కొనసాగిస్తాం. దీన్ని ఉద్యమ రూపంలో బెంగాల్ నుంచి ఢిల్లీకి విస్తరిస్తాం. టీఎంసీకి పోరాడే సత్తా ఉంది. వాళ్లు కన్నెర్ర చేస్తే హడలిపోము, వాళ్ల ఏజెన్సీలను చూసి భయపడం. చచ్చేందుకైనా సిద్ధమే కానీ, కేంద్రం ముందు మోకరిల్లే ప్రసక్తేలేదు" అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News