: హారతి పట్టిందెవరో వ్యాఖ్యలు చేసిన వారికే తెలుసు: డీకే అరుణ
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తనపై చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేత డీకే అరుణ స్పందించారు. మహబూబ్ నగర్ నీటిని తరలించుకుపోతుంటే డీకే అరుణ హారతి పట్టారని, అలాంటి నేతలు మనకవసరం లేదని పార్టీ శ్రేణులనుద్దేశించి హరీశ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై అరుణ మాట్లాడుతూ... హరీశ్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఆరోపణలు చేసేముందు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. రాయలసీమ నేతలకు హారతి పట్టిందెవరో వ్యాఖ్యలు చేసిన వారికే తెలుసని అన్నారు.