: గత జన్మ విశేషాలు వివరిస్తోంది...నమ్మశక్యం కాని నిజం!


గత జన్మ విశేషాలంటూ ఎవరైనా చెబితే అవన్నీ మోసపూరిత కథలంటూ కొట్టిపారేస్తాం. కానీ రాజస్థాన్ లో ఓ 14 ఏళ్ల బాలిక గత జన్మ విశేషాలను పూసగుచ్చినట్టు చెబుతోంది. నమ్మశక్యం కాకున్నా...ఇది నిజం! వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ లోని ఆల్వార్ ప్రాంతానికి చెందిన పూనమ్ (14)కి అకస్మాత్తుగా గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. దీంతో విషయం తల్లిదండ్రులకు వివరించింది. 'చిన్నపిల్ల కథలు విని, ఏవేవో ఊహించుకుని చెబుతోంది' అని అంతా లైట్ తీసుకున్నారు. కానీ పూనమ్ పదే పదే గత జన్మలో ఫలానా ఊరి సర్పంచ్ మనవరాలినని, రెండేళ్ల వయసులో మృతి చెందానని, తన పేరు వసుంధర అని, తనకు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారని చెబుతోంది. అంతే కాకుండా, గత జన్మలోని తల్లిదండ్రులను చూస్తానని పట్టుబట్టడంతో పూనమ్ కోరిక తీర్చాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. దీంతో పూనమ్ చెప్పిన గ్రామానికెళ్లి ఆరాతీశారు. ఆశ్చర్యకరంగా పూనమ్ చెప్పినవన్నీ నిజాలేనని తేలింది. దీంతో ఆ గ్రామస్థులు పూనమ్ ను అద్భుతంలా చూస్తున్నారు.

  • Loading...

More Telugu News