: యాకుబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ కొట్టివేత... ఉరిశిక్ష ఖరారు
1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో దోషి యాకుబ్ అబ్దుల్ రజాక్ మెమన్ కు ఉరిశిక్ష ఖరారైంది. చివరిసారిగా అతను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని మెమన్ కోరగా అందుకు న్యాయస్థానం నిరాకరించింది. గతంలో రాష్ట్రపతికి కూడా అతను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైంది. దాంతో ప్రస్తుతం నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉన్న అతనికి ఈ నెల 30న ఉరిశిక్ష అమలు చేయనున్నారు. పేలుళ్ల కేసులో 2007లో మెమన్ కు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. ఉరిశిక్ష అమలుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్టు చేస్తున్నట్టు సమాచారం.