: ఏపీకి ప్రత్యేక హోదా అవసరంలేదు: బైరెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదాపై రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్నారు. కోస్తా, రాయలసీమ విడిపోయినప్పుడు రాయలసీమకు ప్రత్యేక హోదా అవసరమవుతుందని పేర్కొన్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ కర్నూలులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద విద్యార్థులు చేపట్టిన దీక్షకు బైరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని టీడీపీని విమర్శించారు.