: అత్యంత చౌక ధరలో లభించే 4జి స్మార్ట్ ఫోన్లు ఇవే!


3జి పోయి 4జి వెంటపడి తిరిగే రోజులు వచ్చేశాయి. అత్యంత వేగంగా డేటా బట్వాడా సేవలను దగ్గర చేసే 4జీ సేవలను దేశవ్యాప్తంగా అందించేందుకు రిలయన్స్, ఎయిర్ టెల్ సంస్థలు పోటీ పడుతూ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత చౌక ధరలో లభిస్తున్న 4జి స్మార్ట్ ఫోన్ల వివరాలివి. * జడ్ టీఈ బ్లేడ్ క్యూలక్స్: 4.5 అంగుళాల స్క్రీన్, 8 జిబి ఇంటర్నల్ స్టోరేజీ, 1జిబి రామ్, 8 ఎంపీ కెమెరా, ఆండ్రాయిడ్ తో పాటు 4జి, 3జి, జీపీఎస్ సదుపాయాలున్న ఈ ఫోన్ ధర రూ. 4,999 మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత చౌక 4జి స్మార్ట్ ఫోన్ ఇదే. * యూ యూఫోరియా: 5 అంగుళాల గొరిల్లా గ్లాస్ స్క్రీన్, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్ కోర్ చిప్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జిబీ వరకూ ఎస్డీ కార్డుకు మద్దతిచ్చే ఈ ఫోన్ ధర రూ. 6,999. వీడియోల కోసం 1080 పిక్సెల్ కెపాసిటీని అందించే 8 ఎంపీ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 5 ఎంపీ కెమెరా అదనపు ఆకర్షణలు. బ్యాటరీ సామర్థ్యం 2,230 ఎంఎహచ్ మాత్రమే అయినప్పటికీ, క్విక్ చార్జ్ టెక్నాలజీతో లభిస్తుంది. * జియోమీ రెడ్ మీ 2: 4.7 అంగుళాల హెచ్డీ స్క్రీన్, ట్రాగన్ ట్రయల్ గ్లాస్, 8 జిబి స్టోరేజి, 8, 2 ఎంపీ కెమెరాలతో లభించే ఈ 4జి స్మార్ట్ ఫోన్ ధర కూడా రూ. 6,999 మాత్రమే. * లెనోవో ఎ6000: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్, 8 జిబి స్టోరేజ్, 5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లేతో లభించే ఫోన్ 4జి ఎల్టీఈ కనెక్టివిటీకి అనుకూలంగా పనిచేస్తుంది. రెండు స్పీకర్లతో డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ అనుభూతిని ప్రత్యేకంగా అందించే ఈ స్మార్ట్ ఫోన్ ధర కూడా రూ. 6,999. * ఇన్ఫోకస్ ఎం 350: కేవలం స్మాప్ డీల్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసే వీలున్న ఈ ఫోన్ ధర రూ. 7,999. 5 అంగుళాల హై డెఫినిషన్ డిస్ ప్లే, 1.5 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జిబి రామ్ సహాయంతో ముందు చెప్పిన ఫోన్లతో పోలిస్తే, మెరుగ్గా, వేగంగా పనిచేస్తుంది. వెనుకా, ముందూ 8 ఎంపీ కెమెరాలే ఉండటం ఫోన్ కు అదనపు ఆకర్షణ. * హ్యూవేయ్ హానర్ 4ఎక్స్: 2 జిబి రామ్, 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో పాటు మరింత పెద్ద చిత్రాలను అందించే 13 ఎంపి కెమెరా, మెరుగైన ఫోన్ లైఫ్ కోసం 3000 ఎంఎహెచ్ బ్యాటరీల సదుపాయాలున్న దీని ధర రూ. 10,499. అయితే, మరికొంత కాలం వేచి చూస్తే, ఇంకాస్త తక్కువ ధరకు 4జి ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఎయిర్ టెల్, రిలయన్స్ వంటి సంస్థలు టెల్కోలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో భాగంగా రూ. 4 వేలకు 4జి స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News