: సల్మాన్ ఖాన్ బెయిల్ పై సుప్రీంలో పిటిషన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బెయిల్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టు దానిని విచారణకు స్వీకరించింది. కేసును బదిలీ చేయాలని పిటిషనర్ కోరారు. విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. సెప్టెంబర్ 28, 2002లో సల్మాన్ దూకుడుగా కారు నడపడంతో ముంబయిలోని ఓ బేకరీలోకి కారు దూసుకుపోయింది. ఆ సమయంలో బేకరీ బయట పేవ్ మెంట్ పై నిద్రిస్తున్న వారిలో ఒకరు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ కేసులో రెండు నెలల కిందట విచారణ ముగియడంతో ముంబయి సెషన్స్ కోర్టు సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం బాంబే హైకోర్టు ఆ శిక్షను రద్దు చేసి సల్మాన్ కు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.