: కోటిలింగాల పుష్కర ఘాట్ వద్ద మహిళ ప్రసవం... తల్లీ బిడ్డ క్షేమం


పవిత్ర గోదావరి పుష్కరాల సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 144 ఏళ్లకోమారు జరిగే మహా పుష్కరాల్లో పుణ్యస్నానమాచరిస్తే, శుభం కలుగుతుందన్న భావనతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలున్నా, ఎలాగోలా పుష్కర స్నానం చేయాల్సిందేనన్న గట్టి సంకల్పం వారిని పుష్కర ఘాట్ల వద్దకు తీసుకొస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్ కు నేటి ఉదయం ఓ నిండు గర్భిణి ఇదే భావనతో పుష్కర స్నానం కోసం వచ్చేసింది. అయితే ఘాట్ లోనే పురిటి నొప్పులు వచ్చిన ఆమె అక్కడే పండంటి బిడ్డను ప్రసవించింది. ప్రసవానంతరం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు అక్కడి వైద్య సిబ్బంది తెలిపారు.

  • Loading...

More Telugu News