: ముంబై హార్బర్లో చైనా క్షిపణి విధ్వంసక యుద్ధనౌక


చైనా నావికాదళానికి చెందిన క్షిపణి విధ్వంసక యుద్ధనౌక 'జినన్' ముంబై హార్బర్లోకి వచ్చింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. గల్ఫ్ ఆఫ్ ఆడెన్ లో యాంటీ-పైరసీ మిషన్ కోసం వెళుతున్న చైనా నౌక విశ్రాంతి కోసమే ముంబైలో ఆగిందని అధికారులు తెలిపారు. 24వ తేదీన ఇది ఓమన్ లోని సలాలహ్ తీరానికి బయలుదేరుతుందని వివరించారు. హిందూ మహా సముద్ర జలాల్లో చైనా నావికాదళ కదలికలు పెరిగాయని, ఇది భారత ప్రయోజనాలను దెబ్బతీసే అంశమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో చైనా యుద్ధనౌక ఏకంగా భారత తీరంలో తిష్టవేయడం కొత్త ప్రశ్నలు ఉదయించేలా చేస్తోంది. కాగా, ఈ నెల ప్రారంభంలో చైనా సబ్ మెరైన్ కరాచీ తీరానికి వెళ్లిన సంగతి తెలిసిందే. భారత తీరంలో మాత్రం ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News