: ఏపీలో ఇంతవరకు 2.5 కోట్ల మందికి పైగా పుష్కర స్నానాలు చేశారట
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇంతవరకు 2.5కోట్ల మందికి పైగా పుష్కర స్నానాలు చేశారని డీజీపీ రాముడు తెలిపారు. పుష్కరాలు ముగిసే నాటికి ఈ సంఖ్య 4 కోట్లకు దాటుతుందని అంచనా వేస్తున్నామన్నారు. రాజమండ్రి ఘటన తరువాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఓ తెలుగు చానల్ తో చెప్పారు. పుష్కరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. రాజమండ్రి ఘటనపై కేసు నమోదైందని, ప్రస్తుతం న్యాయ విచారణకు ఆదేశించినందున వ్యాఖ్యానించలేనని రాముడు అన్నారు.