: గోదావరి మహాపుష్కరాలు చరిత్ర సృష్టించాయి: చంద్రబాబు
గోదావరి మహాపుష్కరాలు చరిత్ర సృష్టించాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పుష్కరాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, పుష్కరాల ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. మరో నాలుగు రోజుల్లో పుష్కరాలు ముగియనున్నాయని గుర్తు చేశారు. పుష్కరాల ఏర్పాట్లలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ఈ రోజు రాజమండ్రి నుంచి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వెళ్లిన చంద్రబాబు అక్కడి పుష్కరఘాట్లను పరిశీలించారు.