: బాహుబలికి, బజరంగీ భాయిజాన్ కు ఉన్న కనెక్షన్ ఇదే!


సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్ చిత్రానికి, రాజమౌళి తీసిన బాహుబలికి సంబంధం ఉంది. ఏంటో తెలుసా? రెండు చిత్రాలకూ కథ అందించింది ఒకరే. ఆయనే విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి తండ్రి. ఆయన బజరంగీ భాయిజాన్ కథ రాసుకున్న తరువాత దాన్ని ఎంతో మందికి వినిపించారట. చివరకు కథ నచ్చిన కబీర్ ఖాన్ దాన్ని సల్మాన్ ఖాన్ హీరోగా నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. కాగా, 2012లో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'రౌడీ రాథోడ్'కు కూడా ఆయనే కథ అందించాడు. 2006లో వచ్చిన రవితేజ చిత్రం 'విక్రమార్కుడు'కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. బాహుబలితో పాటు బజరంగీ భాయిజాన్ సైతం బాక్సాఫీసు వద్ద వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.

  • Loading...

More Telugu News