: ఓటుకు నోటు కేసే లేదంటున్న మత్తయ్య... మైండ్ గేమ్ మానుకోవాలని కేసీఆర్ కు హెచ్చరిక


ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు జెరూసలెం మత్తయ్య నిన్న మరోమారు మీడియా ముందుకు వచ్చారు. ఏపీలోని విజయవాడలో ఆయన నిన్న ఓ తెలుగు దినపత్రికతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ఏసీబీ అధికారులు కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే కారు డ్రైవర్లు, ఇంటి పనిమనుషులు, ఆఫీస్ బాయ్ స్థాయి ఉద్యోగులను విచారణ పేరిట ఏసీబీ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. కేసుపై అవగాహన, రాజకీయ తెలివితేటలు లేని కింది స్థాయి సిబ్బందిని విచారణ పేరిట సాయంత్రం వరకూ కార్యాలయంలో కూర్చోబెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అసలు ఓటుకు నోటు కేసే లేదని, అదంతా తెలంగాణ ప్రభుత్వ క్రియేషనేనని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఇకనైనా తన మైండ్ గేమ్ ను మార్చుకోవాలని కూడా ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News