: మేమూ ఊహించని దాడులు చేస్తాం: పాక్ కు భారత సైన్యం తీవ్ర హెచ్చరికలు


కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ కు భారత సైన్యం గట్టి హెచ్చరికలు పంపింది. వాస్తవాధీన రేఖ సమీపంలో ఇదే విధమైన పరిస్థితి నెలకొంటే తాము కూడా ఊహించని దాడులు చేస్తామని లెఫ్టినెంట్ జనరల్ కేహెచ్ సింగ్ హెచ్చరించారు. ఎల్ఓసీ వద్ద సరిహద్దుల ఆవలి నుంచి సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నాలు నిర్విరామంగా జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూసేందుకు ఊహింని దాడులతో వారిని నష్టపరిచి బుద్ధి చెప్పాల్సి వుందని ఆయన అన్నారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి అవకాశాలున్నా, సరిహద్దు గ్రామాలపై రంజాన్ రోజున పాకిస్థాన్ కాల్పులతో విరుచుకు పడిందని ఆయన తెలిపారు. భారత్ జరిపిన ప్రతిదాడుల్లో పాకిస్థాన్ వైపు ఓ బాలిక మరణించిందని, అందుకు చింతిస్తున్నామని ఆయన అన్నారు. ఈద్ ప్రార్థనలు ముగియగానే, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం పాక్ దుందుడుకు చర్యగా ఆయన అభివర్ణించారు. కాగా, ఈ దాడులు, ప్రతిదాడులతో రంజాన్ సందర్భంగా పాక్, భారత్ సైనికులు మధ్య ప్రతియేటా జరిగే మిఠాయిల పంపిణీ కార్యక్రమం రద్దయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News