: పుష్కరస్నానం చేసిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వీఐపీ ఘాట్ లో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఈ ఉదయం పుష్కరస్నానం ఆచరించారు. తరువాత పిండప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లు బాగున్నాయని మెచ్చుకున్నారు. మహాకుంభమేళా స్థాయిలో గోదావరి పుష్కరాలను ప్రభుత్వం అద్భుతంగా నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. తుళ్లూరులో ఏపీ రాజధాని నిర్మాణం ఈ తరం అదృష్టమని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు.