: అలనాటి నటి కనకం ఇక లేరు
తెలుగు చిత్రసీమ టాలీవుడ్ లో మరో మరణం చోటుచేసుకుంది. పాత తరం మేటి నటి టి.కనకం (88) కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. విజయవాడలోని కేదారేశ్వరిపేటలోని తన స్వగృహంలోనే ఆమె కన్నుమూశారు. పాతాళభైరవి, షావుకారు, లేత మనసులు, గుణసుందరి కథ, కీలుగుర్రం, గృహప్రవేశం, బ్రహ్మరథం తదితర చిత్రాల్లో నటించిన కనకం 2004లో ఎన్టీఆర్ థియేటర్ అవార్డును అందుకున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కనకం నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు.