: పుష్కరాలపై రాంగోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్!


పవిత్ర గోదావరి పుష్కరాలు తెలుగు రాష్ట్రాలతో పాటు నదీ పరీవాహక రాష్ట్రాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలు నేటితో ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ పుష్కర స్నానం కోసం తరలివస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతటి పవిత్ర పుష్కరాలపై సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన బాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుష్కరాల పేరిట నదులను కలుషితం చేస్తున్నామంటూ ఆయన కలకలం రేపారు. ‘‘అభివృద్ది చెందిన దేశాలు నదులను పరిశుభ్రంగా ఉంచుకుంటూ... అభివృద్ధి చెందిన దేశాలుగానే కొనసాగుతున్నాయి. కానీ పుష్కరాల పేరిట మనం మాత్రం నదులను కలుషితం చేస్తున్నాం’’ అని ఆయన ట్విట్టర్ లో వివాదాస్పద కామెంట్ ను పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News