: చంద్రబాబు ఆదేశాలు బేఖాతర్... తణుకు టోల్ గేట్ వద్ద వసూళ్లు, భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్


పవిత్ర గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలిగించని విధంగా చర్యలు తీసుకోవాలన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి ఆదేశాలు అమలు కావడం లేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో శనివారం నెలకొన్న భారీ ట్రాఫిక్ నేపథ్యంలో రెండు జిల్లాల్లో పుష్కరాలు ముగిసేదాకా టోల్ గేట్ వసూళ్లను నిలిపివేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తత్ఫలితంగా టోల్ గేట్ల వద్ద రద్దీని నివారించవచ్చని చంద్రబాబు సూచించారు. శని, ఆది, సోమ వారాల్లో చంద్రబాబు ఆదేశాల మేరకు టోల్ గేట్ల వద్ద వసూళ్లు నిలిచినా, నేటి ఉదయం తణుకు సమీపంలోని టోల్ గేట్ వద్ద మళ్లీ వసూలు ప్రారంభమైంది. దీంతో అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామైంది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News