: ధోనీ ‘బొమ్మ’లను క్లీన్ చేసుకుంటున్నాడు... ట్విట్టర్ లో కెప్టెన్ కూల్ భార్య పోస్ట్!


టీమిండియా వన్డే, టీ20 జట్ల నాయకుడు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఏం చేస్తున్నాడు? జింబాబ్వే టూరుకు కుర్రాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ పంపడంతో కాస్తంత విశ్రాంతి దొరికిన ధోనీ... ఇంట్లోనే ఉంటున్నాడా? లేక ఇంకేమైనా పని పెట్టుకున్నాడా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. వీటికి సమాధానంగా అతడి భార్య సాక్షి సింగ్ నిన్న ట్విట్టర్ లో ఓ ఆసక్తికర కామెంట్ ను పోస్ట్ చేశారు. ‘‘ధోనీ తన ’బొమ్మ’లను శుభ్రం చేసుకుంటున్నాడు. తానే స్వయంగా పనిలో నిమగ్నమై ఉన్నాడు’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. అసలు సాక్షి ప్రస్తావించిన ‘బొమ్మ’లేమిటో తెలుసా? ధోనికి అత్యంత ఇష్టమైన బైకులేనట. కామెంట్ తో పాటు ధోనీ తన బైకులతో పోజిచ్చిన ఫొటోను కూడా ఆమె తన ట్వీట్ కు జత చేసింది.

  • Loading...

More Telugu News