: సల్మాన్ సినిమాకు యూపీలో పన్ను రాయితీ


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'బజరంగీ భాయిజాన్' కు ఉత్తరప్రదేశ్ లో పన్ను రాయితీ కల్పించారు. ఈ సినిమా దర్శకుడు కబీర్ ఖాన్ సోమవారం యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ను కలిసి మాట్లాడారు. ఆయనకు 'బజరంగీ...' చిత్ర విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా అఖిలేశ్ రాష్ట్రవ్యాప్తంగా సల్మాన్ సినిమాకు వినోద పన్ను రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు. సినీ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. యూపీలో సినిమాలకు అనువైన మంచి లొకేషన్లు ఉన్నాయని, ఫిలిం మేకర్లు ఇక్కడికి రావాలని కోరారు.

  • Loading...

More Telugu News