: కేసీఆర్ పది కోట్లిచ్చారు...దేవాలయాలకు రంగులు వేయిస్తాం: తలసాని
బోనాల ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పది కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బోనాల పండుగలో అన్ని శాఖల ఉద్యోగులు పాలుపంచుకుంటారని అన్నారు. సీఎం విడుదల చేసిన నిధులతో హైదరాబాదు వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలకు రంగులు వేయించి, ఫ్లోరింగ్ పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. బోనాల ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుందని ఆయన ప్రకటించారు.