: మూడు రోజుల్లోనే వంద కోట్లు...సల్మాన్ సినిమా రికార్డు


ఈద్ కానుకగా విడుదలైన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా రికార్డు వసూళ్ల దిశగా సాగిపోతోంది. సల్మాన్ ఖాన్ సినీ జీవితంలో మేటి చిత్రంగా అభిమానులు పేర్కొంటున్న 'భజరంగీ భాయ్ జాన్' కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల రూపాయలు కొల్లగొట్టడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో విడుదలైన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లో 102 కోట్ల వసూళ్లను సాధించిందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. గత శుక్రవారం విడుదలైన 'భజరంగీ భాయ్ జాన్', అంతకు ముందు శుక్రవారం విడుదలైన 'బాహుబలి' సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో భారతీయ సినిమా సత్తాను చాటాయని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ ట్వీట్ చేయడం విశేషం.

  • Loading...

More Telugu News