: రాజధాని నిర్మాణం కోసం మూడు రకాల ప్రణాళికలు ఇచ్చాం: సింగపూర్ మంత్రి
ఏపీ రాజధాని బృహత్ ప్రణాళికను పూర్తి చేశామని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అన్నారు. రాజధాని నిర్మాణంకోసం మొత్తం మూడు రకాల ప్రణాళికలు ఇచ్చామని వెల్లడించారు. రాజధాని సీడ్ క్యాపిటల్ ప్రణాళికను మీడియా ముఖంగా సీఎం చంద్రబాబుకు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. భవిష్యత్ లోనూ రాజధాని అభివృద్ధిలో పాలుపంచుకుంటామని చెప్పారు. తమ దేశ సంస్థలు, కంపెనీలు పూర్తిస్థాయి రాజధాని నిర్మాణంలో ఉంటాయన్నారు. ఇక తమను పుష్కరాలకు ఆహ్వానించిన చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. తమ స్నేహం సుదీర్ఘకాలం ఉంటుందని స్పష్టం చేశారు.