: షాహిద్ కి ఒక్కటిస్తే కానీ పుకార్లు సద్దుమణిగేలా లేవు: డాన్స్ డైరెక్టర్
షాహిద్ కపూర్ వివాహానికి, రిసెప్షన్ కి బాల్య మిత్రుడు అహ్మద్ ఖాన్ ఆహ్వానించ లేదంటూ బాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై షాహిద్ కపూర్ బాల్య స్నేహితుడు డాన్స్ డైరెక్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ, ఈసారి కలిసినప్పుడు షాహిద్ కి లాగి ఒక్కటిస్తే కానీ పుకార్లు సద్దుమణిగేలా లేవని అన్నాడు. తమ మధ్య వివాదం లేదని, అవన్నీ పుకార్లని కొట్టిపడేశాడు. మరి షాహిద్ వివాహానికి కానీ రిసెప్షన్ కి కానీ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించగా, తన కుమారుడికి సంబంధించిన కార్యక్రమంలో బిజీగా ఉన్నానని తెలిపాడు. గ్రీస్ లో ఇవ్వాలనుకున్న బ్యాచులర్ పార్టీకి, తరువాత వివాహానికి తనను ఆహ్వానించాడని అహ్మద్ ఖాన్ చెప్పాడు. తామిద్దరం బాల్యం నుంచి కలిసి పెరిగామని, చిరకాల మిత్రులమని తెలిపాడు. త్వరలోనే తమ రెండు కుటుంబాలు కలిసి ఎక్కడికైనా వెళ్లే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నామని అహ్మద్ ఖాన్ వెల్లడించాడు. ఎవరి పనుల్లో వారు ఉండడం వల్ల కొన్ని నెలలుగా కలుసుకోలేదని అహ్మద్ స్పష్టం చేశాడు.