: బల్గేరియాలో కారు విన్యాసాలు బాగా చేశా: షారూఖ్
బల్గేరియాలో కారుతో విన్యాసాలు బాగా చేస్తున్నానని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తెలిపాడు. సెకెండ్ ఇన్నింగ్స్ లో రెండు హిట్లిచ్చిన కాజోల్ తో మూడోసారి హిట్ కోసం షారూఖ్ జతకడుతున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న 'దిల్ వాలే' షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. దీంతో యాక్షన్ సీక్వెల్ లో భాగంగా షారూఖ్ కారుతో ఫీట్లు చేస్తున్నాడు. దీనిపై షారూఖ్ ట్విట్టర్లో స్పందించాడు. కారుతో విన్యాసాలు చేయడం బాగా నచ్చిందని తెలిపాడు. సాహస సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కిస్తున్న చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపాడు. కాగా, ఈ సినిమాలో షారూఖ్ సరసన కాజోల్ నటిస్తుండగా, వరుణ్ ధావన్ సరసన కృతి సనన్ నటిస్తోంది. ఇతర పాత్రల్లో వినోద్ ఖన్నా, బొమన్ ఇరానీ, కబీర్ బేడీ, సంజయ్ మిశ్రా, వరుణ్ శర్మ తదితరులు నటిస్తున్నారు.