: కమిటీ తీర్పుకు వ్యతిరేకం కాదు... అమలు విధివిధానాల కోసమే అధ్యయనం: ఐపీఎల్ చీఫ్ శుక్లా


ఐపీఎల్ ఫిక్సింగ్ స్కాంపై ఆర్ఎం లోథా కమిటీ ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసేందుకు బీసీసీఐ ఓ ప్రత్యేక కమిటీని ప్రకటించడం తెలిసిందే. ఈ కమిటీలో సభ్యుడైన ఐపీఎల్ పాలక మండలి చీఫ్ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ... లోథా కమిటీ ఇచ్చిన తీర్పును బీసీసీఐ అంగీకరించిందని, అయితే, ఆ తీర్పును ఏ విధంగా అమలుచేయాలన్న దానిపైనే తమ అధ్యయనం ఉంటుందని వివరించారు. ఐపీఎల్-9లో కనిష్ఠంగా ఎనిమిది జట్లు ఆడతాయని, ఆ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు. "లోథా కమిటీ తీర్పుకు మేం వ్యతిరేకం కాదు. ఆ తీర్పు అమలు విధివిధానాలపైనే మేం అధ్యయనం చేస్తాం. నిర్ణయాలు ప్రకటించేముందు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటాం" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News