: కేవలం మూడు గంటల్లోనే విల్లా...ఇంజనీర్ల అద్భుత ఆవిష్కరణ


విల్లా కట్టాలంటే ఏడాదికి పైగా పడుతుంది. అలాంటిది మూడుగంటల్లో విల్లా కట్టడం ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? సాంకేతిక అద్భుతాలు సాధించడంలో ఇంజనీర్లు పోటీ పడుతున్నారు. చైనాలోని షాంక్సి ప్రాంగణంలో 3-డి విల్లాను ఇంజనీర్లు నిర్మించారు. కేవలం మూడు గంటల్లోనే అద్భుతమైన విల్లాను నిర్మించడం విశేషం. 3-డి ప్రింటెడ్ ప్రక్రియతో నిర్మించిన వంట గది, హాలు, పడకగదులను క్రేన్ తో లేపి విల్లాలా అమర్చారు. అయితే ఈ విల్లా నిర్మాణానికి ఒక్కో చదరపు మీటరుకు 400 నుంచి 480 డాలర్ల ఖర్చవుతుందని విల్లా రూపకర్తలు తెలిపారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా 3-డి ప్రింట్ టెక్నాలజీతో ఇల్లు నిర్మించుకునేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటి నాణ్యత, మన్నికపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News