: మళ్లీ గెలవలేమన్న భయంతోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం లేదు: తెలంగాణ పీసీసీ చీఫ్


పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో మళ్లీ గెలవలేమన్న భయంతోనే రాజీనామా చేయడం లేదని ఎద్దేవా చేశారు. వాళ్లకే గనుక దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకోవాలని ఉత్తమ్ సవాల్ విసిరారు. అసలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇంతవరకు వేటు వేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఇదే క్రమంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన మంత్రి తలసాని శ్రీనివాస్ రాజీనామా వ్యవహారం హాస్యాస్పదంగా మారిందని ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News