: కూతురు పెళ్లికి రావాలంటూ రజనీ, కమల్ లను ఆహ్వానించిన శివరాజ్ కుమార్
ప్రముఖ కన్నడ హీరో శివరాజ్ కుమార్ కుమార్తె నిరుపమ వివాహం దిలీప్ తో ఆగస్టు 31న జరగనుంది. ఈ నేపథ్యంలో, తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ లను స్వయంగా కలసి వారిని తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు శివరాజ్ కుమార్. అదే విధంగా సినీనటులు ధనుష్, నాజర్, ప్రభు, ప్రకాశ్ రాజ్, శివకార్తికేయన్ లను కూడా ఆహ్వానించారు. అలాగే, డీఎంకే నేత స్టాలిన్ ను కూడా కలసి వివాహానికి రావాల్సిందిగా కోరారు. శివరాజ్ కుమార్ కుమార్తె నిరుపమ డాక్టర్ గా పనిచేస్తున్నారు. మరోవైపు, ఆయన శివలింగ, కిల్లింగ్ వీరప్పన్ సినిమాల్లో నటిస్తున్నారు.