: రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వ లెక్కలు మోసపూరితం: కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్
తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడంలేదని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రైతుల మారణహోమం జరుగుతున్నా ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టైనా లేదని విమర్శించారు. జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించిన వివరాలు చూస్తే ప్రభుత్వం మోసపూరిత లెక్కలు ఏంటో అర్థమవుతాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యిమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, కాదు 90 మందేనని కేసీఆర్ ప్రభుత్వం లెక్కలు చెబుతోందని మండిపడ్డారు. తెలియకపోతే ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను సీఎంకు పంపిస్తామని శ్రవణ్ చెప్పారు.