: బాహుబలిలో ఎక్కువ కష్టపడింది ఆ సీన్ కోసమే!: ప్రభాస్
అత్యంత వ్యయ ప్రయాసలతో రాజమౌళి టీం కష్టపడి నిర్మించిన బాహుబలి చిత్రంలో ఏ సీన్లో నటించేందుకు ప్రభాస్ కష్టపడాల్సి వచ్చిందో తెలుసా? అది ఏ యుద్ధం సీనో, రోప్ లు కట్టుకుని కొండ అంచుకు వేలాడే సీనో, లేదంటే శివలింగాన్ని భుజాలపై మోస్తూ, నాచు నిండిన బండలపై నడిచేందుకో కాదు... మరింకేంటి అనుకుంటున్నారా? శివుడి కాళ్లను కట్టప్ప (తమిళ నటుడు సత్యరాజ్) తన తలపై పెట్టుకునే సీన్లోనట. ఈ విషయాన్ని ప్రభాసే స్వయంగా చెప్పాడు. ఆ సీన్ షూటింగ్ రోజు పడినంత టెన్షన్ ఇంకెప్పుడూ పడలేదని, ఆ సీన్ ఎలా తీయాలా? అని ఎంతో మథనపడ్డామని వివరించాడు. ఆ సీన్ ఉందన్న విషయాన్ని సత్యరాజ్ కు చెప్పవద్దని తాను రాజమౌళిని కోరానని, తీరా ఆ సీన్ తీసే రోజు విషయం చెబితే ఆయన వెంటనే ఒప్పుకోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నాడు. ఈ సీన్లో ఎంతో మానసిక శ్రమ ఉందని, 'మిర్చి' చిత్రంలో సత్యరాజ్ కుమారుడిగా తాను నటించడం, అప్పుడు ఏర్పడిన అనుబంధం ఈ చిత్రానికి తోడ్పడిందని తెలిపాడు.