: 6 బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ లు ఇవే... మరి, మీ దగ్గర ఏ ఫోనుంది?


డిజిటల్ కెమెరాల యుగం అంతరించి, చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే ఫోటోలను తీసుకుంటున్న రోజులు వచ్చేశాయి. ఎటువంటి ట్రైపాడ్ పై నిలపకున్నా చిత్రాలు స్థిరంగా వచ్చేలా చూసే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) కూడా స్మార్ట్ ఫోన్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యుత్తమ కెమెరా పనితనంతో అందుబాటులో ఉన్న ఆరు స్మార్ట్ ఫోన్ల వివరాలివి. 1. యాపిల్ ఐఫోన్ 6 ప్లస్: కేవలం 7.1 ఎంఎం మందంతో లభించే ఈ ఫోన్లో 8 ఎంపీ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో లభిస్తుంది. చిత్రాలు తీసేటప్పుడు చేతులు కదిలినా తీసిన ఫోటో షేక్ కాకుండా రావడం దీని ప్రత్యేకత. లైటింగ్ తక్కువగా ఉన్న సమయంలో కూడా కాంతిమంతమైన చిత్రాలను అందిస్తుంది. 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్ లో ఫోటోలను సులువుగా ఎడిట్ చేసుకోవచ్చు. 2. శాంసంగ్ గెలాక్సీ ఎస్-6: 16 ఎంపీ కెమెరాతో సెకనుకు 30 ఫ్రేమ్స్ ను 4కే రెజల్యూషన్లో చిత్రీకరించగల ఈ స్మార్ట్ ఫోన్లోనూ ఓఐఎస్ ఉంది. ఓ ఫోటో తీసేముందే అక్కడున్న కాంతి, దూరం, పిక్చర్ మోడ్ తదితరాలను సులువుగా మార్చుకునే సదుపాయం ఉంది. ఫోన్ డిస్ ప్లే 2560/1400 పిక్సెల్ రెజల్యూషన్లో ఉండడం అదనపు ఆకర్షణ. 3. బ్లాక్ బెర్రీ పాస్ పోర్ట్: చదరపు ఆకృతిలో స్క్రీన్ ఉండి 1:1 నిష్పత్తిలో (3120/3120) రెజల్యూషన్ ఇచ్చే ఏకైక ఫోన్ ఇదే. 13 ఎంపీ కెమెరాతో లభించే ఫోన్లో పనోరమా, టైమ్-షిఫ్ట్ మోడ్ తదితరాలతో పాటు హెచ్డీఆర్ మోడ్, ఫుల్ హెచ్డీతో విడీయోలను చిత్రీకరించుకోవచ్చు. 4. నోకియా లూమియా 830: నోకియా మొబైల్ విభాగాన్ని మైక్రోసాఫ్ట్ విలీనం చేసుకున్న తరువాత మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లో 10 ఎంపీ కెమెరా ఉంటుంది. ప్యూర్ వ్యూ టెక్నాలజీ, చిత్రాలను మరింత స్పష్టంగా నిక్షిప్తం చేసే కార్ల్ జీసిస్ లెన్స్ దీనికి అదనపు ఆకర్షణ. షట్టర్ వేగాన్ని నాలుగు సెకన్ల వరకూ పెంచుకునే సదుపాయమూ ఉంది. 5. ఎల్ జీ - జీ4: ప్రస్తుతం లభిస్తున్న అత్యుత్తమ కెమెరా స్మార్ట్ ఫోన్లలో ముందు నిలిచే సత్తా ఉన్న ఈ ఫోన్లో 16 ఎంపీ కెమెరా ఉంది. లేజర్ ఆటోఫోకస్, ఇన్ స్టంట్ ఫోకసింగ్, కలర్ స్పెక్ట్రమ్ సెన్సార్, లైవ్ ప్రీవ్యూ సెట్టింగ్స్ వంటి ఎన్నో ఆప్షన్స్ నుంచి కావాల్సిన వాటిని ఎంచుకుని అద్భుతమైన చిత్రాలను దీంతో తీయవచ్చు. 6. ఇన్ ఫోకస్ ఎం530: ఓఐఎస్ ఆప్షన్ తో లభిస్తున్న అతి తక్కువ ధర గల స్మార్ట్ ఫోన్ ఇదే. డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్, ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్, మల్టిపుల్ సీన్ మోడ్స్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఫోటో తీసిన తరువాత మరో ఫోటో తీసేందుకు స్మార్ట్ ఫోన్ సిద్ధమయ్యే సమయం కూడా ఎంతో తక్కువ. 5.5 అంగుళాల స్క్రీన్ మంచి చిత్రానుభూతిని అందిస్తుంది. అదండీ సంగతి... మరి మీ దగ్గర ఏ ఫోన్ ఉంది?

  • Loading...

More Telugu News