: సోదరుల చేతిలో మోసపోయిన కంతేటి... హైకోర్టులో పిటీషన్ దాఖలు
కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ గా ఉమ్మడి రాష్ట్ర పీసీసీలో ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీ మాజీ నేత కంతేటి సత్యనారాయణరాజు మోసానికి గురయ్యారు. వేరెవరి చేతుల్లోనో కాదట... తన సొంత సోదరుల చేతిలోనే మోసపోయారు. ఈ మేరకు ఆయన తన సోదరులపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని కోర్టెక్కారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కంతేటి దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన కోర్టు, ఆయన సోదరులపై 420 సహా, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.