: అనంతపురం జిల్లాలో వింత... నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపిల్ల
అనంతపురం జిల్లా పెనుగొండలో వింత చోటు చేసుకుంది. స్థానిక రాజరాజేశ్వరి కాలనీలో నివాసం ఉండే ఆదినారాయణ అనే వ్యక్తి నెల క్రితం ఓ కోడిని కొన్నాడు. ఆ కోడి 12 గుడ్లను పెట్టింది. వాటిని పొదిగించగా 8 పిల్లలు పుట్టాయి. అందులో ఓ కోడిపిల్ల ఏకంగా నాలుగు కాళ్లతో పుట్టింది. ఈ వార్త చుట్టుపక్కల వ్యాపించింది. ఆశ్చర్యపోయిన జనాలు కోడిపిల్లను చూడ్డానికి వస్తున్నారు. నాలుగు కాళ్లతో పుట్టినప్పటికీ కోడిపిల్ల మాత్రం ఆరోగ్యంగానే ఉంది.