: డెమీ మూర్ స్విమ్మింగ్ పూల్ లో యువకుడి మృతదేహం
హాలీవుడ్ శృంగార తారగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న డెమీ మూర్ స్విమ్మింగ్ పూల్ లో 21 సంవత్సరాల యువకుడి మృతదేహం లభ్యమైంది. లాస్ ఏంజెలెస్ లోని ఆమె నివాసంలో నిన్న అనుమానాస్పద స్థితిలో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. చనిపోయిన యువకుడి పేరు ఎడెనిల్సెన్ స్టీవెన్. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి డెమీ మూర్ స్టాఫ్ గా భావిస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో డెమీ తన నివాసంలో లేనట్టు సమాచారం. చనిపోయిన యువకుడికి ఈత రాదని... పొరపాటున పూల్ లో పడి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. జరిగిన ఘటనతో డెమీ మూర్ స్పందిస్తూ, ఇదొక విషాద ఘటన అని తెలిపింది. స్టీవెన్ కుటుంబసభ్యులకు అండగా ఉంటానని చెప్పింది.