: గురువు కన్నీటిని తుడిచిన అబ్దుల్ కలామ్!
ఎప్పుడో 60 సంవత్సరాల నాడు తనకు విద్య నేర్పించిన గురువును ఇప్పటికీ గుర్తుంచుకున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, ఆయన్ను కలిశారు. ప్రస్తుతం 91 సంవత్సరాల వయసులో ఉన్న చిన్నదురై 1950వ దశకంలో తిరుచ్చి సెయింట్ జోసెఫ్ కాలేజీ ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పనిచేశారు. అదే కాలేజీలో కలామ్ చదువుతున్న సమయంలో వైజ్ఞానిక రంగంపై ఆయనకు ఆసక్తి పెరిగిన కారణం చిన్నదురై చెప్పిన పాఠ్యాంశాలే. దిండుకల్ ఏసుసభ గృహంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను స్వయంగా కలిసేందుకు కలామ్ వెళ్లగా, తన శిష్యుడిని చూసి చిన్నదురై ఆనంద బాష్పాలు రాల్చారు. గురువు కన్నీరు తుడిచిన కలాం, ఆయనను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. తాను రచించిన ఓ పుస్తకాన్ని ఇచ్చారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.