: సుందర్ బన్స్ అడవుల్లో మ్యాన్ ఈటర్... టూరిస్టును లాక్కెళ్లిన పెద్దపులి
పశ్చిమ బెంగాల్ లోని సుందర్ బన్స్ అభయారణ్యంలోని ఓ పెద్దపులి టూరిస్టును లాక్కెళ్లింది. ఈ ఘటనలో తన సోదరుడిని కాపాడేందుకు ప్రయత్నించిన యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అడవుల్లో పర్యటనకు 24 పరగణాల జిల్లా, కుల్తాలీ ప్రాంతానికి చెందిన బాదల్ నాస్కార్, సుప్రియో నాస్కార్ అనే సోదరులు వచ్చారు. వారు అజాగ్రత్తగా ఉండడంతో, బాదల్ పై దాడి చేసిన ఓ పెద్దపులి అతని మెడను పట్టుకుని అడవుల్లోకి లాక్కెళ్లింది. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన సుప్రియోపై తన పంజా విసిరింది. తీవ్రగాయాల పాలైన సుప్రియోను ఆసుపత్రికి తరలించారు. బాదల్ జాడ తెలియకపోవడంతో స్థానికులతో కలసి అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.