: ఈ పరిస్థితుల్లో ప్రత్యూష కోర్టుకు రాలేదన్న వైద్యులు...విచారణ 27కు వాయిదా


కన్న తండ్రి, పిన తల్లి వేధింపులతో జీవచ్ఛవంలా మారిన ప్రత్యూష ఇప్పటికిప్పుడు కోర్టుకు వచ్చే పరిస్థితి లేదు. తీవ్ర గాయాలపాలైన ఆ బాలిక ప్రస్తుతం ఎల్బీనగర్ లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి, ప్రత్యూష ఆరోగ్యం కుదుటబడ్డాక ఆమెతో మాట్లాడాలని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చేరేనాటితో పోలిస్తే, ప్రస్తుతం కాస్త ఆరోగ్యం కుదుటపడ్డప్పటికీ, ప్రత్యూష మరో వారం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని అవేర్ గ్లోబల్ వైద్యులు నివేదించారు. వైద్యుల నివేదికను ఎల్బీ నగర్ పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి కేసు విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News