: నిన్న రాత్రీ నిద్రపోని చంద్రబాబు... రాజమండ్రిలో ట్రాఫిక్ ను పర్యవేక్షించిన వైనం


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. పుష్కరాలకు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగరాదని నిర్ణయించుకున్న ఆయన అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూనే, ఆయా ప్రాంతాల్లో నెలకొన్న ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించే విషయంపై దృష్టి సారించారు. శుక్రవారం రాత్రి కంటి మీద కునుకు వేయని చంద్రబాబు, నిన్న రాత్రి కూడా నిద్రకు దూరంగా ఉన్నారు. అర్ధరాత్రి రాజమండ్రి వీధుల్లోకి వచ్చిన చంద్రబాబు నేటి తెల్లవారుజామున 5.30 గంటల దాకా ఆయన రోడ్లపైనే ఉన్నారు. ట్రాఫిక్ పై అధికార యంత్రాంగానికి సలహాలు, సూచనలు ఇస్తూనే భక్తులతో మాట కలిపారు. పుష్కర స్నానం కోసం వచ్చి ఇబ్బందులేమైనా ఎదుర్కొంటున్నారా? అంటూ ఆయన భక్తులను అడిగారు.

  • Loading...

More Telugu News